![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ఎంతోమందికి పరిచయం అయిన వారిలో టేస్టీ తేజ ఒకడు. ఇతడు చేసే ఫుడ్ వ్లాగ్స్ లో ఫుడ్ టేస్ట్ కంటే సెలెబ్రిటీలు ఇతనికి వేసే పంచులే ఫేమస్ అయ్యాయి. తాజాగా రిలీజైన హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జాతో కలిసి చేసిన ఓ వ్లాగ్ లో టేస్టీ తేజకు పంచుల మీద పంచులు పడ్డాయి. అలా ఏ వ్లాగ్ చేసిన జెన్యున్ అండ్ నేచురల్ డైలాగ్స్ తో సినిమా ప్రేక్షకులకే కాదు ఇన్ స్ట్రాగ్రామ్ ట్రోలర్స్ కి కంటెంట్ ఇస్తుంటాడు టేస్టీ తేజ.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టిలతో ఎక్కువ సమయం గడిపిన టేస్టీ తేజ.. ప్రస్తుతం వ్లాగ్స్ చేసుకుంటూ ఫేమస్ అవుతున్నాడు. ప్రియాంక జైన్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. అది చూసి ఎంతోమంది తనకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు తేజతో కలిసి ప్రియాంక జైన్, ఆమె భాయ్ ఫ్రెండ్ శివ్ కలిసి ఓ వీడియోని బయటకు వదిలారు. అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియాంక జైన్.. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 లో సందడి చేసింది. ఇక ప్రియాంక హౌస్ లో ఎంటర్ అయ్యాక.. బీబీ వంటలక్కగా పేరుతెచ్చుకుంది. ఇంట్లోని వారందరికీ తన వంటలతో రుచిచూపించింది. అంతేనా శివంగిలా అన్ని గేమ్స్ లో ఆడుతూ... బిగ్ బాస్ షోలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో చోటు దక్కించుకుంది. హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ప్రియాంక తన ఫ్రెండ్ అమర్ దీప్ తో కలిసి ఎక్కువగా ఉండేది. శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ ల గ్రూప్ గేమ్ నచ్చక చాలామంది వీరిపై ట్రోల్స్ చేశారు.
ప్రియాంక మీద టేస్టీ తేజ, శివ్ కలిసి ఫ్రాంక్ చేసారు. తేజ ఇంట్లో వంట చేస్తుండగా సడన్ గా గుండెనొప్పి వస్తున్నట్టుగా కిందపడిపోయాడు. అలాగే కిందపడిపోవడంతో ప్రియాంక కంగారు పడింది. వెంటనే శివ్ ని అంబులెన్స్ కి ఫోన్ చేయమని అటుఇటు తిరగింది. తనకేం ఏం చేయాలో తెలియక కాళ్ళు చేతులు ఆగట్లేదని ప్రియాంక అంది. అలా కాసేపు ప్రియాంకని ఆటపట్టించాక ప్రాంక్ చేసామని చెప్పారు. దాంతో ప్రియాంక.. ఇలాంటి విషయాల్లో ప్రాంక్ చేస్తారా అంటూ సీరియస్ అయింది. ఇదంతా ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |